Site icon HashtagU Telugu

Vijayadashami: విజయదశమి పండుగ ఎప్పుడు..? తెలంగాణ విద్వత్సభ క్లారిటీ..!

Vijayadashami

Dasara

Vijayadashami: తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ విజయదశమి (Vijayadashami). ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతే ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. విజయదశమి పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. వర్గల్‌లోని విద్యాసరస్వతి దేవాలయంలో ఇటీవల జరిగిన తెలంగాణ విద్వుత్సభ షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతులు ధర్మశాస్త్రానుసారముగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి తెలిపారు.

Also Read: TTD : వ‌రుస సెల‌వుల‌తో తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి..?

We’re now on WhatsApp. Click to Join

ఈ నిర్ణయాన్ని శృంగేరీ జగద్గురువులు, కంచికామకోటి పీఠాధీశ్వరులు, పుష్పగిరిపీఠం, గురుమదనానంద పీఠం పీఠాధీశ్వరులు ఆమోదించినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలందరూ దసరా పండుగను 23న జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ సూచించింది. కాగా పలు క్యాలెండర్లలో ఈ నెల 24న దసరా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తెరుచుకోనున్నాయి.