Site icon HashtagU Telugu

UP : విద్యార్థినులు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ..పోలీసులకు ఫిర్యాదుతో..!!

Up

Up

యూపిలో ఘోరం జరిగింది. కొల్ కత్తా నుంచి టూర్ కు వచ్చిన విద్యార్థినులు వారణాసిలోని ఓ గెస్ట్ హౌస్ లో బస చేశారు. బస చేసిన రూములో విద్యార్థినులు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.  బట్టలు మార్చుకుంటుండగా అనుమానం వచ్చిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గెస్ట్ హౌజ్ చేరుకున్న పోలీసులు సీసీటీవీ డీవీఆర్ ను స్వాదీనం చేసుకున్నారు. గెస్ట్ హౌస్ నిర్వాహుడిపై కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరద్కోఠి ప్రాంతంలో ఉన్న గెస్ట్ హౌజ్ కు ..కోల్ కత్తా నుంచి టూర్ కు వచ్చిన విద్యార్థినులు బ్రుందం బస చేసింది. వసతి గృహంలో ఉంటున్న బాలికలు దుస్తువులు మార్చుకునే సమయంలో…రూములో సీసీ కెమెరా ఆన్ లోనే ఉండటం కనిపించింది. అనుమానం వచ్చిన బాలికలు  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వారి అనుమానం నిజం అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో చూడగా…విద్యార్థినులకు సంబంధించిన విజువల్స్ కనిపించాయి. విద్యార్థినిలు చెప్పినట్లుగానే  దుస్తువులు మార్చుకుంటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో మహిళా పోలీసులు గెస్ట్ హౌజ్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.