వాట్సాప్, ఐఫోన్ కు షాక్ ఇచ్చింది. అక్టోబర్ 24 నుంచి పలు ఐఫోన్ మోడల్స్ లో తమ యాప్ పని చేయదని స్పష్టం చేసింది. పాత iOS 10, iOS 11 వెర్షన్‌లపై రన్ అవుతున్న ఐఫోన్‌లకు సపోర్ట్ నిలిపి వేస్తామని వెల్లడించింది. అయితే వాటిలో వాట్సాప్ సర్వీసులు కొనసాగాలంటే.. ఫోన్లలో సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరింది.
ఇన్ యాప్ మెసేజ్ ఇది..
“2022 అక్టోబర్ 24 తర్వాత
పాత iOS 10, iOS 11 వెర్షన్‌లపై
వాట్సాప్ పని చేయడం ఆగిపోతుంది. దయచేసి సెట్టింగ్‌లోని జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ట్యాప్ చేయండి. మీ డివైజ్‌ను లేటెస్ట్ ఐఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి” అని ఇన్‌యాప్ మెసేజ్‌లో ఆయా ఐఫోన్ల వినియోగదారులకు వాట్సాప్ సూచిస్తోంది. ఈమేరకు ఇన్ యాప్ మెసేజ్ లు పంపుతోంది.
ఏం చేయాలి?
ఒకవేళ మీ ఐఫోన్ ఇంకా iOS 10 లేదా iOS 11 పై రన్ అవుతుంటే.. iOS 12 లేదా లేటెస్ట్ iOS 15.. ఇలా మీ ఫోన్‌కు సపోర్ట్ చేసే దానికి అప్‌గ్రేడ్ కావొచ్చు. ఇలా చేస్తే వాట్సాప్‌ను అక్టోబర్ 24 తర్వాత కూడా వినియోగించుకోవచ్చు. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ మొబైళ్లను ఇంకా వినియోగిస్తున్నట్టయితే మీరు iOS 12కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ యూజర్లకు చింత లేదు. అయితే ఐఫోన్ 5 (iPhone 5) , ఐఫోన్ 5సీ (iPhone 5C) మోడళ్లు అప్‌డేట్‌కు సపోర్ట్ చేయవు. అంటే అక్టోబర్ 24 తర్వాత ఈ ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు.
ఎందుకీ నిర్ణయం..
ఈ సంవత్సరం iOS 16, iPadOS 16, macOS 13 వెర్షన్‌లను వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో యాపిల్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో iOS 10, iOS 11 డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయాలని వాట్సాప్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఐవోఎస్ 10, 11ల మీద పనిచేసే ఫోన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్నాయి.
ఆండ్రాయిడ్‌లో..
ఇప్పటికీ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న మొబైళ్లను అప్‌డేట్ చేసుకో వాల్సిందిగా వాట్సాప్ సూచిస్తోంది. ఒకవేళ అప్‌డేట్‌కు సపోర్ట్ చేయని ఫోన్‌లో వాట్సాప్ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.