WhatsApp: ఇకపై ఆడియో ఫైల్స్ వినడం మరింత ఈజీ, వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..!

వాట్సాప్....ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్స్ లో ఇది ఒకటి. మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఎప్పటి నుంచో అగ్రస్థానంలో ఉంది. సుమారు రెండు బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 09:30 AM IST

వాట్సాప్….ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే యాప్స్ లో ఇది ఒకటి. మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ఎప్పటి నుంచో అగ్రస్థానంలో ఉంది. సుమారు రెండు బిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఎంతో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుకే ఈ యాప్ కు ఎక్కడా లేని క్రేజ్ ఉంది. అయితే వాట్సాప్ లో కూడా ఇబ్బంది కలిగించే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాటిని సరిచేస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సారి ఆడియోకు సంబంధించి ఓ కొత్త అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే…మామూలుగా వాట్సాప్ లో మనకు వచ్చే వాయిస్ మెసేజ్ ను ప్లే చేసి చాట్ పేజ్ నుంచి బయటకు వస్తే ఆడియో ఆగుతుంది. వాయిస్ మెసేజ్ వినాలనుకుంటే యాప్ నుంచి బయటకు రావాల్సిందే.

అయితే ఇక నుంచి అలా ఆగకుండా బ్యాక్ గ్రౌండ్ లో కూడా వాయిస్ మెసేజ్ ను వినేలా గ్లోబల్ ఆడియో ఫీచర్ త్వరలోనే రానుంది. ఈ ఫీచర్ తో వినియోగదారులకు భారీ ఊరట కలగనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాక్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్ను పరీక్షించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వాయిస్ మెసేజ్ ఫైల్ ఆడియో వినాలంటే చాట్ విండో ఓపెన్ చేసి ఉంచాలి. సదరు యూజర్ చాట్ నుంచి బయటకు వచ్చినట్లయితే చాట్ ఆడియో ఆగిపోతుంది. అంతేకాదు ఫైల్స్ లో ఆడియో ఎక్కడుందో వెతికి పట్టుకోవడం కూడా చాలా కష్టం.

అందుకే ఆ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ త్వరలోనే గ్లోబల్ ఆడియో ప్లేయర్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ద్వారా అప్లికేషన్ లో ఎక్కడైనా వాయిస్ మెసేజ్ లను వినే ఛాన్స్ ఉంటుంది. ఈ వాయిస్ లు ఒక ప్లేయర్ సాయంతో ప్లే అవుతుంటాయి. ఆ ప్లేయర్ లోనే మిగతా వాట్సాప్ వాయిస్ లను కూడా ప్లే చేసుకోవచ్చు. ముందుగా ఈ కొత్త ఫీచర్ ios ఫ్లాట్ ఫాంలో నిర్దిష్ట బీటా టెస్టర్ లకు విడదుల చేయనున్నారు. తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

ఇక ఈ తాజా ఫీచర్ను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్, వాట్సాప్ బీటా ఇన్ఫో గుర్తించింది. దీంతో పాటుగా వాయిస్ మెసేజ్ లను పాజ్, ప్రివ్యూ చేసే మరికొన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.