Site icon HashtagU Telugu

WhatsApp Dark Bar : టాప్ మారిపోద్ది.. వాట్సాప్ ఇంటర్ ఫేస్ లో మార్పు

Whatsapp Dark Bar

Whatsapp Dark Bar

WhatsApp Dark Bar  : వాట్సాప్ ఇంటర్ ఫేస్ లో త్వరలో మరో మార్పు జరగబోతోంది. వాట్సాప్ యాప్ ఎగువ భాగంలో ఉండే బార్ ను పూర్తిగా డార్క్ బ్లాక్ రంగులోకి మార్చనున్నారు. ప్రస్తుతం ఈ మార్పును Google Play Storeలో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.23.13.17 వర్షన్ లో టెస్ట్ చేస్తున్నారు. ఈమేరకు ఇంటర్ ఫేస్ లో మార్పు చేయాలని చాలామంది వినియోగదారులు కోరడంతో యాప్ లోని టాప్ బార్ రంగును మారుస్తున్నారు.  టాప్ బార్ లో సరికొత్త డార్క్ థీమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. గ్రే స్కేల్, నలుపు రంగు కలయికగా వచ్చే డార్క్ బ్లాక్ థీమ్ పనితీరుపరంగా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నారు. AMOLED స్క్రీన్‌తో వస్తున్న లేటెస్ట్ ఫోన్లకు ఈ థీమ్   మరింత అందాన్ని ఇస్తుందని అంటున్నారు. ఈ మార్పుతో జరుగుతున్న బీటా టెస్టింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఓ టెక్ వార్తా సంస్థ విడుదల చేసింది. 

Also read : Goldy Brar-Salman Khan : సల్మాన్ ఖాన్ టార్గెట్ అంటున్న గోల్డీ బ్రార్ ఎవరు ?

పెద్ద సైజులో ఎమోజీ స్టిక్కర్లు 

వాట్సాప్ విండోస్‌లో వినియోగదారులు పెద్ద ఫార్మాట్‌లో ఎమోజీ స్టిక్కర్‌లను పంపడానికి అనుమతించే కొత్త ఆప్షన్‌ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎమోజీలు సాధారణంగా చిన్నగా ఉంటాయి. దీంతో అవి విజువల్ ఎఫెక్ట్‌ను అందించడం లేదు. వీటి సైజు చిన్నగా ఉండటం కారణంగా యూజర్లు తక్కువగా ఎమోజీలను వాడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన వాట్సాప్ ఎమోజీలను డిఫాల్ట్‌గా పెద్ద ఫార్మాట్‌లో ఇవ్వాలని చూస్తోంది. ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో విండోస్ అప్‌డేట్‌లో బీటా టెస్టర్లకు విడుదల చేయడం ప్రారంభించింది. త్వరలో మిగతా వారికి అందుబాటులోకి రానుంది.