Site icon HashtagU Telugu

Message Pin Duration : వాట్సాప్ మెసేజ్ ఇక పిన్ చేసేయండి

Whatsapp Microphone Access

Whatsapp Microphone Access

Message Pin Duration : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.

దాని పేరే “మెసేజ్ పిన్ డ్యూరేషన్”.. 

దీని ద్వారా వ్యక్తిగత వాట్సాప్ చాట్‌లు, వాట్సాప్  గ్రూప్‌లలో ఏదైనా ఒక మెసేజ్ ను కొంత టైం పాటు పిన్ చేసి  ఉంచొచ్చు..   

ఇందుకోసం ఆ మెసేజ్ ను సెలెక్ట్ చేసి..  “మెసేజ్ పిన్ డ్యూరేషన్” ఆప్షన్ ను సెలెక్ట్ చేసి.. ఎంత టైం పాటు అది పిన్ అయి ఉండాలనేది సెట్టింగ్ చేయాలి.. 

దీనివల్ల.. పిన్ చేసిన మెసేజ్ ముఖ్యమైందనే విషయం ఇతరులకు ఈజీగా అర్ధమైపోతుంది.  

వాట్సాప్ “మెసేజ్ పిన్ డ్యూరేషన్”(Message Pin Duration) ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్ లోనే ఉంది. Google Play స్టోర్‌లో అందుబాటులో ఉన్న Android 2.23.13.11 బీటా వర్షన్ లో దీని టెస్టింగ్ జరుగుతోంది. ఈ ఫీచర్ లో భాగంగా మనం మెసేజ్ ను ఎంత టైం కోసం పిన్ చేస్తామో.. ఆ టైం ముగియగానే అది అన్ పిన్ అవుతుంది. అంటే ఆ తర్వాత నార్మల్ మెసేజ్ లాగే కనిపిస్తుంది.

Also read : 1975 Emergency Explained : ఇందిరాగాంధీ..1975 ఎమర్జెన్సీ..5 కారణాలు

 

Also read : Yamaha R3: ఇండియా మార్కెట్ లోకి యమహా R3.. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి..!

ఒక మెసేజ్ ను  24 గంటలు, 7 రోజులు, 30 రోజుల పాటు పిన్ చేసి ఉంచే సౌకర్యం ఉంటుందని అంటున్నారు. ఈ వ్యవధి ముగిసేలోగా ఎప్పుడైనా మనం దాన్ని అన్ పిన్ చేయొచ్చు.దీనివల్ల వాట్సాప్ గ్రూప్ లలో యాడ్స్ ను, ముఖ్యమైన నోటీసులను, కీలకమైన నోటిఫికేషన్లను ప్రత్యేకంగా కనిపించేలా పోస్ట్ చేసే వెసులుబాటు కలుగుతుంది.  పిన్ చేసిన మెసేజ్ లు ప్రత్యేకంగా కనిపిస్తూ దృష్టిని ఆకర్షిస్తాయి.