WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్… పెరగనున్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ కాలపరిమితి..!

వాట్సాప్...మోస్ట్ మెసేజింగ్ పాపులర్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయడంలో ముందుంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫీచర్లలో మార్పులు చేస్తూ వాటిని మరింత ఉపయోకరంగా మారుస్తునే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 12:36 PM IST

వాట్సాప్…మోస్ట్ మెసేజింగ్ పాపులర్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయడంలో ముందుంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఫీచర్లలో మార్పులు చేస్తూ వాటిని మరింత ఉపయోకరంగా మారుస్తునే ఉంటుంది. ఇక ఇప్పటికే అందుబాటులోఉన్న డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ కాలపరిమితిని పొడిగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత కాలపరిమితి ఒక గంట 8 నిమిషాల 16 సెకన్లు. అయితే త్వరలో దానిని రెండు రోజులకు వరకు కాలపరిమితి పెంచనున్నట్లు తెలుస్తోంది. అంటే మెసేజ్ పంపించిన రెండు రోజుల తర్వాత కూడా యూజర్లు తమ మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు. ప్రస్తుత సమయ పరిమితి మెసేజ్ పంపిన తర్వాత ఒక గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు మాత్రమే మెసేజ్ డిలీట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్తగా వస్తున్న మార్పుతో ఏడు రోజుల ఎనిమిది నిమిషాల లోపు పంపిన మెసేజ్ ను కూడా డిలీట్ చేయవచ్చు. అంటే వారం రోజుల క్రితం పంపిన మెసేజ్ లను కూడా చాట్ సహా డిలీట్ చేసుకోవచ్చు.

ఇక వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo రిపోర్టు ప్రకారం…వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కాల పరిమితిని ఒక గంట నుంచి రెండు రోజులకు పెంచేందుకు టెస్ట్ చేస్తోంది. అయితే వాట్సాప్ ఈ ఫీచర్ ను రిలీజ్ చేసినట్లయితే యూజర్లు తమ మెసేజ్ లను రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడా కాలపరిమితిని ఏడు రోజులకు మార్చాలని యోచిస్తోంది. ఫీచర్ ను రూపొందించిన తర్వాత అడ్మిన్ ద్వారా తొలగించబడింది.

అయితే ఇంతకుముందు వాట్సాప్ కాలపరిమితిని ఒక వారానికి పెంచాలని ఆలోచనను వాట్సాప్ విరమించుకుంది. వాట్సాప్ iMessage వంటి మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్స్ ను మళ్లీ టెస్ట్ చేయాలని భావిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం వాట్సాప్ బీటా యొక్క కొత్త అప్ డేట్ లో మెసేజ్ రియాక్షన్స్ ( ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ) సిద్ధం చేస్తోంది. వాట్సాప్ టిప్ స్టర్ ఈ ఫీచర్ను రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో అనేది స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. మెసేజ్ రియాక్సన్స్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఎమోజీల గ్రూపుతో మెసేజ్ లకు రియాక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతిస్తుంది.
ఇక మెసేజ్ రియాక్షన్స్ ఎండ్ టు ఎండ్ ఎక్ క్రిప్ట్ చేయబడుతాయాని Wabetanifo ఇంతకుముందే వెల్లడించింది. కాబట్టి చాట్ లో మీ మెసేజ్ లను ఎవరూ చూసే ఛాన్స్ లేదు. ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.