WhatsApp: వాట్సప్‌ను నమ్మలేం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత నూతన మార్పులు తీసుకొస్తున్నారు. ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించి ఆర్ధిక భారం తగ్గించుకోవడంతో పాటు బ్లూటిక్‌కు పెయిన్ సబ్‌స్క్రిప్షన్ పెట్టాడు.

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 09:21 PM IST

WhatsApp: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత నూతన మార్పులు తీసుకొస్తున్నారు. ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించి ఆర్ధిక భారం తగ్గించుకోవడంతో పాటు బ్లూటిక్‌కు పెయిన్ సబ్‌స్క్రిప్షన్ పెట్టాడు. బ్లూటిక్ కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ట్విట్టర్‌కు రూ.కోట్ల ఆదాయం వస్తోంది. ట్విట్టర్ లోగోలో పిట్టకు బదులు కుక్కను పెట్టారు. అయితే కొద్దిరోజులకే దానిని తీసివేశారు.

అయితే మొబైల్ యాప్స్‌లలో 2.24 బిలియన్ల యూజర్లతో వాట్సప్ ఉందట. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపాడు. యాప్ యాక్టివ్‌గా లేనప్పుడు కూడా వాట్సప్ లోని మైక్రోఫోన్ యాక్స్‌స్‌లోనే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాట్సప్ ను నమ్మలేదమన్నాడు. తాను నిద్రపోయే సమయంలో కూడా మైక్రోఫోన్ ఆన్ అవుతుందని, వాట్సప్ యూజ్ చేనప్పుడు కూడా మైక్రోఫోన్ యాక్సెస్‌లో ఉంటుందని చెప్పాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా యూజర్ పెట్టాడు. దీనికి ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు.

వాట్సప్‌ను విశ్వసించలేమని, త్వరలోనే ట్విట్టర్ లో కూడా వాయిస్ మెసేజెస్, వీడియో చాట్ ఆఫ్షన్లను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. వినియోగదారులు ఎక్కడికైనా ఫోన్ మాట్లాడుకునే సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ ఇలాంటి వెసులుబాటు కల్పిస్తోంది. త్వరలో ట్విట్టర్ లో కూడా వాయిస్ మెసెజెస్, వీడియో ఛాట్ ఆప్షన్లను తీసుకురానుందని తెలుస్తోంది. ఇది తీసుకొస్తే ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ కోవలోకి ట్విట్టర్ కూడా చేరనుంది.

అయితే మైక్రోఫోన్ ఆరోపణలపై వాట్సప్ స్పందించింది. మైక్ సెట్టింగ్స్ పై యూజర్లకు పూర్తి కంట్రోల్ ఉంటుందని స్పష్టం చేేసింది. ఎలాంటి కమ్యూనికేషన్ అయినా సరే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా రక్షించబడుతుందని స్పష్టం చేసింది.