Site icon HashtagU Telugu

Starbucks CEO : స్టార్ బక్స్ సీఈవో లక్ష్మణ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Laxman Narasimhan

Laxman Narasimhan

గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓ గా భారత్ కీ చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన లక్ష్మీనరసింహన్ కొత్త సీఈఓ ఎంపిక అవడం పై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్‌ లీడర్స్‌ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్‌ అతున్నారు అంటూ వారు వ్యాఖ్యానించారు. కాగా 2023 ఏప్రిల్‌ నుంచి లక్ష్మణ్ నరసింహన్ సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్నారు.

కాగా సీఈఓ గా లక్ష్మణ్ నరసింహన్‌ కు వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్‌ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 10 కోట్లు. ఇదే విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్‌ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్‌ డాలర్ల అంటే సుమారు రూ. 73 కోట్లు విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకోబోతున్నారు లక్ష్మణ్. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్‌ డాలర్లకు అనగా రూ. 107 కోట్లకు పైగా సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారట.

ఇదే విషయం పై లక్ష్మణ్ సంతోషంగా స్పందిస్తూ..కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌ లో చేరడం సంతోసంగా ఉందని తెలిపాడు నరసింహన్‌. కాగా గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓ గా భారత సంతతికి చెందిన వ్యక్తి సీఈవోగా ఎంపిక అయినందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. లక్ష్మణ్ నరసింహన్ రాబోయే 2023లో సీఈవోగా బాధ్యతలను చేపట్టబోతున్నారు.

Exit mobile version