RGV:ఎంఐఎం నేతలకు టీఆరెస్ భయపడుతోంది..రఘునందన్ రావు చెప్పిందే నిజం.!!

జూబ్లీహిల్స్ అత్యాచారఘటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు. నాయకుల ప్రభావం వల్లే పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్నాడు.

  • Written By:
  • Updated On - June 8, 2022 / 12:20 PM IST

జూబ్లీహిల్స్ అత్యాచారఘటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు. నాయకుల ప్రభావం వల్లే పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్నాడు. సజ్జనార్ లాంటి సీనియర్ అధికారిని టీఎస్ ఆర్టీసికి పరిమితం చేశారని చెప్పుకొచ్చాడు వర్మ. ఎంఐఎం నేతలకు టీఆరెస్ నేతలు భయపడుతున్నారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సామాన్యుడిగా నాకు మాత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పిందే నిజం అనిపిస్తుందని ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.

కాగా నిర్భయ కేసులో మైనర్ నిందితుల పేర్లుఎందుకు బయటకు వచ్చాయన్న రఘునందన్ రావు…ఈకేసులో ఎంఐఎం ఎమ్మెల్యేకొడుకు ప్రమేయం లేదంటూ పోలీసులుక్లీన్ చీట్ఎలాఇస్తారంటూ ప్రశ్నించారు. మంత్రికేటీఆర్ చేసిన తర్వాతే పోలీసులు ఎందుకు హడావుడి చేశారు..అప్పటి వరకు ఎందుకు సైలెంట్ గాఉన్నారంటూ నిలదీశారు. కేటీఆర్ సొంత పార్టీకోసం కాకుండా పక్కపార్టీ వారినికాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఎంఐఎం వాళ్లని అరెస్టు చేయకుండా ప్రయత్నం చేస్తున్నారన్న రఘునందన్ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ విధంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.