Site icon HashtagU Telugu

Pragyan Vs Crater : చంద్రయాన్-3 టీమ్ టెన్షన్.. రోవర్ ఎదుట గుంత.. ఏం జరిగిందంటే.. ?

Pragyan Vs Crater

Pragyan Vs Crater

Pragyan Vs Crater : చంద్రుడి దక్షిణ ధ్రువంపై చక్కర్లు కొడుతున్న వేళ.. మన చంద్రయాన్-3 రోవర్ ‘ప్రజ్ఞాన్’ కు లేటెస్ట్ గా  ఒక పెద్ద సవాల్ ఎదురైందట..  !!  ‘ప్రజ్ఞాన్’ బుడిబుడి అడుగులతో వెళ్తున్న దారి  మధ్యలో  100 మి.మీ సైజు కలిగిన ఒక గుంత (బిలం) ఎదురొచ్చిందట. తనకున్న కెమెరా విజన్ తో ఆ గుంతను ముందే పసిగట్టిన ‘ప్రజ్ఞాన్’.. సమయ  స్ఫూర్తితో వ్యవహరించి ఆ గుంత వైపు వెళ్లకుండా పక్క నుంచి సేఫ్ గా ముందుకు సాగిందట.  ఇదంతా బెంగళూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చూస్తూ కూర్చున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో టెన్షన్ కు గురయ్యారని తెలిసింది. ‘ప్రజ్ఞాన్’ ఎక్కడ ఆ గుంతలోకి పడిపోతుందోనని ఆందోళన చెందారని సమాచారం. ఎట్టకేలకు ఆ గుంత వైపునకు కాకుండా మరో వైపునకు రోవర్ దారిని మార్చుకోవడంతో ఇస్రో సైంటిస్టులు ఊపిరి పీల్చుకున్నారని పలువురు చెప్పారు.  చంద్రుడి ఉపరితలంపై తన లైఫ్ టైమ్ (14 రోజుల్లో) ముగిసేలోగా ఇలాంటి ఇంకెన్నో సవాళ్లను రోవర్ ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Also read : KCR Secret Operation : కేసీఆర్ సీక్రెట్ ఆపరేషన్..నిజమెంత..?

డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డీఈఎం) అనే సాంకేతిక అనుసంధాన పద్ధతి ద్వారా రోవర్ ‘ప్రజ్ఞాన్’ కు ఇస్రో శాస్త్రవేత్తలు ఆదేశాలు పంపుతుంటారు. వీటి ఆధారంగానే చంద్రుడిపై ఏ దిక్కులో వెళ్లాలి ? ఎంతదూరం వెళ్లాలి ? ఎక్కడ ఏమేం చేయాలి ? అనే సమాచారం రోవర్ కు చేరుతుంది. అయితే ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయని.. రోవర్ కు కూడా కొంత స్వేచ్ఛ ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకసారి డీఈఎం సిగ్నలింగ్ మెసేజ్ ను రోవర్ కు పంపిస్తే.. అది 5 మీటర్లు జర్నీ చేస్తుందన్నారు. ఇలా ఒక్కో డీఈఎం.. చెరో 5 మీటర్ల జర్నీకి గైడెన్స్ చేస్తుందన్నారు. అయితే ఆ 5 మీటర్ల జర్నీని రోవర్ పూర్తి చేసేలోగా.. మరో కొత్త  డీఈఎం సిగ్నల్ ను పంపేందుకు అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు వివరించారు. కమాండ్ ఇచ్చేసిన ఐదు మీటర్ల దూరం ప్రయాణించే క్రమంలో దారి మధ్యలో రోవర్ కు ఏవైనా గుంతలు, ఆటంకాలు ఎదురైనప్పుడు పెను సవాల్ గా (Pragyan Vs Crater) మారుతుంటుందని  తెలిపారు. ఈక్రమంలోనే తాజాగా ఒక గుంత ఎదుటకు రోవర్ వెళ్లి నిలబడినా సైంటిస్టులు ఏమీ చేయలేక టెన్షన్ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.