Site icon HashtagU Telugu

What Next For CSK: ధోనీ వారసుడు ఎవరు?

Dhoni As Uncapped Player

Dhoni As Uncapped Player

ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక ఆకస్మిక పరిణామం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మారాడు. రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకొని .. ఆ బాధ్యతలను జార్ఖండ్ డైనమెట్  MS ధోనీకి తిరిగి అప్పగించాడు. నేడు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగే మ్యాచ్ కు ధోనీ కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ మార్పు ఎందుకు జరిగింది ? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.మొదటిది.. ఈ ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి రవీంద్ర జడేజా ఆటతీరు బాగా లేదు.

గత 8 ఐపీఎల్ మ్యాచ్ లలోఅతడు కేవలం 112 రన్స్ చేశాడు. కెప్టెన్సీ వల్ల జడేజాపై ఎంతగా ఒత్తిడి పెరిగిందంటే .. క్యాచ్ లు కూడా వదిలిసేంతగా!! అండర్-19 ఇండియా టీమ్ లో ఉన్నప్పుడు తప్పించి ఎన్నడూ కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా అతడికి లేదు. జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పేముందు జడేజా.. ‘ నా ఆటపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని స్పష్టం చేశాడు. అయితే ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ లలో 2 మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఈతరుణంలో మళ్లీ కెప్టెన్సీకి ధోనీ వచ్చినా.. పెద్ద అద్భుతాలు జరగపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ధోనీ వయసు 40 ఏళ్ళు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దాని కెప్టెన్ సుదీర్ఘ కాలం కొనసాగాలని కోరుకుంటుంది. ఈక్రమంలో జట్టును సుదీర్ఘ కాలం నడిపే భావి కెప్టెన్ కోసం అన్వేషణ ప్రారంభించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత భావి CSK కెప్టెన్ ఎంపికపై ఆ జట్టు యాజమాన్యం దృష్టిపెట్టొచ్చని భావిస్తున్నారు.