Kohinoor: కోహినూరు కథ ఏంటీ? రాజులకు అరిష్టం.. రాణులకు అదృష్టమా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంది. అది భారత్‌కు చెందినదని తెలిసినా… తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు.

  • Written By:
  • Publish Date - February 16, 2023 / 09:04 PM IST

Kohinoor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంది. అది భారత్‌కు చెందినదని తెలిసినా… తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. అటు వైపు బ్రిటీష్‌ ప్రభుత్వం సైతం ముందడుగు వేయటం లేదు. అసలు ఈ ఖరీదైన వజ్రం అక్కడికి ఎలా చేరింది. ఎన్ని ఏళ్ల నుంచి బ్రిటీష్‌ రాణులు ఉపయోగిస్తున్నారు. ఇది అక్కడి రాజులకు ఎందుకు అచ్చు రావటం లేదో ఇప్పుడు చదివేద్దాం.

ప్రపంచంలోని అనేక దేశాలను బ్రిటిన్‌ ఏలింది. అందుకే రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు గాంచింది. భారత దేశాన్ని బ్రిటన్‌ ఆక్రమించి, ఇక్కడి సంపదను ఆ దేశానికి తరలించింది. చరిత్ర పుటలు తీస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ఈ దేశ రాజుల నుంచి విలువైన వస్తువులు దోచుకెళ్లారన్నది సత్యం. అందుకే వలస పాలనకు గుర్తుగా బ్రిటన్ రాచకుటుంబం చేతిలో ఇప్పటికీ కోహినూర్ వజ్రం ఉంది.

గతేడాది రాణి ఎలిజబెత్-2 కన్ను మూశారు. మరణించే వరకు ఆమె కిరీటంలోనే కోహినూర్ వజ్రం ఉండేది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె దాన్ని ధరిస్తూ వచ్చారు. రాణి మరణం తరువాత ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషిక్తుడు కానున్నాడు. విక్టోరియా మహారాణి కోహినూర్ గురించి రాసిన వీలునామా ప్రకారం ఛార్లెస్ భార్య, బ్రిటన్ రాణి కెమిల్లా దానిని ధరించాల్సి ఉంటుంది. కానీ కెమిల్లా తన కిరీటం కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారని ఇటీవల రాజభవనం వర్గాలు తెలిపాయి.

చరిత్రలో కోహినూర్ ధరించిన రాజులందరూ చరిత్రలో కలిసిపోయారు. అందుకే ఛార్లెస్-3, కెమిల్లా కోహినూర్‌కు దూరం పెడుతున్నా రా? అనే సందేహాలు మొదలయ్యాయి. తెలుగు నేలపై కోహినూర్ పుట్టుక.. కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలున్నా యి. చాలా మంది ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్ దొరికిందని చెబుతారు. అప్పుడు దాని బరువు గురించి కచ్చితమైన రికార్డులు లేవు. ప్రస్తుతం కోహినూర్ 105.6 క్యారెట్లు ఉంది. ఈ వజ్రం కాకతీయుల ఆధీనంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నా రు. వారి ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు.. దిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకొని అపారమైన సంపద, కోహినూర్ వజ్రం సమర్పించుకున్నాడని అంటారు.

చివరికి 1850వ సంవత్సరంలో బ్రిటన్‌లో ఉన్న క్వీన్ విక్టోరియా వద్దకు డైమండ్ చేరింది. ఆమె దాన్ని లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అయితే కోహినూర్ వన్నె తగ్గిందని భావించిన విక్టోరియా 1852లో దానికి మెరుగులు దిద్దించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోహినూరు వజ్రం టవర్ ఆఫ్ లండన్ వద్దనున్న జువెల్ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం మాకు ఇవ్వాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ తిరస్కరించింది. పాక్, అఫ్గాన్ దేశాలు కూడా ఈ వజ్రం తమ సొంతమని.. తమకే ఇవ్వాలని అడుగుతున్నాయి.