Site icon HashtagU Telugu

GOLD :ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ప్రస్తుతం ఎంతుదంటే..?

Gold Bars Shimmering

Gold Bars Shimmering

GOLD : బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి.10 రోజుల్లో దాదాపు 5000 రూపాయలు పెరిగాయి.దీంతో దేశంలో బంగారం ధర జీవిత కాల స్థాయికి చేరుకుంది.సోమవారం మధ్యాహ్నం 1.00 గంటకు బంగారం ధర 1.67 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.60,375కి చేరుకుంది. బులియన్ మార్కెట్‌లో బంగారం ప్రారంభం కావడమే రూ.59,671 తో ప్రారంభమైంది. ఫిబ్రవరి 2న 10 గ్రాములకు రూ. 58,882 వద్ద ఆల్ టైమ్ హైని వదిలివేసింది.

ఒడిశాలోని భువనేశ్వర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గత వారం రూ.57,620గా ఉన్న ధర రూ.61,400కు చేరుకుంది. ఊహించనిరీతిలో ధరలు పెరగడం కొనుగోలుదారులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలు చేసేవారు మానుకుంటున్నారు.10 గ్రాముల బంగారం ధర రూ.50,000 నుంచి రూ.60 వేలకు చేరుకోవడానికి రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది. 17 ఏళ్లలో బంగారం ధరలు 6 సార్లు పెరిగాయి.పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేసిన మార్కెట్ నిపుణులు, అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభం కారణంగానే బంగారం ధరలు పెరిగాయని చెబుతున్నారు.

బ్యాంకింగ్ సంక్షోభం సాధారణమయ్యే వరకు బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని, ఇదే తీరు కొనసాగితే బంగారం ధర త్వరలో రూ.70,000కు చేరే అవకాశం ఉందని ఆభరణాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. బంగారమే కాకుండా వెండి ధర కూడా ఊపందుకుంది. గత వారం రోజులుగా కిలో వెండి ధర రూ.5000 పెరిగింది. మార్చి 12న కిలో వెండి ధర రూ.65,000 ఉండగా, ఈరోజుకు రూ.70,000కి చేరింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న భారీ హెచ్చు తగ్గులు ప్రజలను బంగారం కొనుగోలు వైపు ఆకర్షిస్తున్నాయి.