Site icon HashtagU Telugu

Gas Cylinder Price: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..?

LPG Cylinders

14 Kg Lpg Gas Cylinder Price Today

Gas Cylinder Price: కేంద్ర ప్రభుత్వం ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర(Gas Cylinder Price)ను ఈరోజు అంటే బుధవారం 30 ఆగస్టు 2023 నుండి రూ.400 తగ్గించింది. సామాన్యులకు LPG సిలిండర్ 200 రూపాయల చౌకగా లభిస్తుంది. అదే సమయంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 400 తక్కువ గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 9.6 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.400 తక్కువ ధరలో వంట గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఈ పథకం కింద మరో 75 లక్షలు జోడించబడతాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మినహాయింపు ద్వారా మొత్తం 33 కోట్ల మంది ఎల్‌పిజి సిలిండర్ వినియోగదారులు ప్రయోజనం పొందనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు

కేంద్రం వంటగ్యాస్ ధర రూ. 200 మేర తగ్గించడంతో ఏపీలో సిలిండర్ ధర రూ. 915కు చేరింది. తెలంగాణలోని హైదరాబాద్ లో రూ.955గా ఉంది. ఉజ్వల కనెక్షన్ అయితే మరో రూ.200 తక్కువకే సిలిండర్ వస్తుంది. తగ్గింపు ధరలు నేటి నుంచి అమలు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం సిలిండర్ పై రూ.40 సబ్సిడీ వస్తోంది. ధరలు తగ్గించిన తర్వాత ఎంత సబ్సిడీ ఉంటుందనే దానిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.

కేంద్ర ప్రభుత్వ ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు న్యూఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1103 నుంచి రూ.903కి తగ్గింది. భోపాల్‌లో రూ.908, జైపూర్‌లో రూ.906. కోల్‌కతాలో రూ.1129 నుంచి రూ.929కి, ముంబైలో సిలిండర్ ధర రూ.1102.50 నుంచి రూ.902.50కి తగ్గింది. అదేవిధంగా చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్‌ కొత్త ధర రూ.1118.50 నుంచి రూ.918.50కి తగ్గింది.

Also Read: Railway Recruitment 2023: రైల్వే శాఖలో 2 వేల కంటే ఎక్కువ పోస్టులకు రిక్రూట్‌మెంట్.. దరఖాస్తు చేసుకోండిలా..!

7,680 కోట్ల భారం పెరుగుతుంది

ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా ధరలను తగ్గించి సోదరీమణులకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద కానుక ఇచ్చారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ నిర్ణయంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పెరగనుంది. మార్చి 2023లో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో ధర 1103కి పెరిగింది. అంతకుముందు జూలై 6, 2022న ధరలను రూ.50 పెంచారు.

ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్..?

ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ రూ.500కే ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు రాజస్థాన్‌లో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి వచ్చింది.