Site icon HashtagU Telugu

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ కు వర్షం అడ్డంకి… మ్యాచ్ జరగకుంటే ఎవరిది టైటిల్ ?

IPL 2023 Opening Ceremony LIVE

Ipl 2023 Gt Vs Csk Live Score

IPL 2023 Final: అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా 7.30 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మరింత ఆలస్యం కానుంది. ఇప్పటి వరకూ టాస్ కూడా పడలేదు. భారీ వర్షం కురుస్తుండడంతో స్టేడియం మొత్తం కవర్లను కప్పి ఉంచారు. వర్షం త్వరగా తగ్గిపోవాలని భారీగా తరలివచ్చిన అభిమానులు కోరుకుంటున్నారు.

వర్షంతో అటు ఆటగాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమవగా.. ఫ్యాన్స్ గొడుగులు పట్టుకుని స్టేడియంలోనే వేచి చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 20 ఓవర్ల పూర్తి మ్యాచ్ జరిగేందుకు రాత్రి 9.35 గంటల వరకూ సమయముంది. ఆ టైమ్ దాటితే ఓవర్లను కుదిస్తారు. చివరిగా ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు రాత్రి 11.56 వరకూ టైముంది. ఒకవేళ ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యపడకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

దురదృష్టవశాత్తూ అసలు ఇవాళ ఆట జరగకుంటే రేపు ఫైనల్ నిర్వహిస్తారు. ఎందుకంటే బీసీసీఐ ఫైనల్ మ్యాచ్ కు రిజర్వే డేను ప్రకటించింది. దీంతో సోమవారం రాత్రి 7.30 గంటలకు పూర్తి మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకుంటే గుజరాత్ ను టైటిల్ విన్నర్ గా ప్రకటిస్తారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వర్షంతో ఫైనల్ మ్యాచ్ రద్దయితే లీగ్ స్టేజ్ లో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టుకే టైటిల్ దక్కుతుంది. దీని ప్రకారం చూసుకుంటే గుజరాత్ లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ లో ముగించింది. చెన్నై రెండో ప్లేస్ లో నిలిచింది. దీంతో వర్షంతో మ్యాచ్ రద్దయితే వరుసగా రెండోసారి గుజరాత్ టైటిల్ ను కైవసం చేసుకుంటుంది.

Read More: Ambati Rayudu IPL Retirement: ఐపీఎల్‌కు అంబటి రాయుడు గుడ్ బై … ఇక నో యూ టర్న్