Site icon HashtagU Telugu

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు వెళ్తుండగా ఏం జరిగిందంటే!

Rahul Gandhi Confidence on congress winning in Telangana Josh in TS Congress

Rahul Gandhi Confidence on congress winning in Telangana Josh in TS Congress

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం పార్లమెంటుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఓ వ్యక్తి ఓ స్కూటర్‌పై నుంచి పడిపోయారు. ఇది గమనించిన రాహుల్‌ వెంటనే కారు దిగి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది అతనిని లేపగా అనంతరం రాహుల్ స్కూటర్‌ ను లేపి ఆ వ్యక్తితో మాట్లాడారు. దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడిగారు. ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. డ్రైవింగ్‌ విషయంలో తగు జాగ్రత్తగా ఉండమని అతనికి సూచనలు చేశారు. ఆ వ్యక్తికి కరచాలనం చేసి వెంటనే అక్కడ నుంచి బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Also Read: AP BRS: వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రజలు సిద్దం