Site icon HashtagU Telugu

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా.. ఈ ఆహార పదార్థాలు ఖచ్చితంగా తినండి!

Work From Home

Work From Home

దేశ వ్యాప్తంగా కరోనా మరొకసారి కోరలు చాస్తోంది. కరోనా మహమ్మారి రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తోంది. అయితే కరోనా మహమ్మారి మొదటి వేవ్ మొదలైనప్పటి నుంచి ప్రైవేట్ కంపెనీలు అలాగే కొన్ని గవర్నమెంట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నీ ఇచ్చాయి. ఉద్యోగులు ఇంటి దగ్గర ఉండి చేయడంతో పని వేళలు ఎక్కువ అయ్యాయి. అయితే ఇటువంటి సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లోనే ఎక్కువసేపు కూర్చొని ఉండటం, అలాగే మానిసిక ఒత్తిడి పెరగడం తదితర కారణాలతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవాళ్లు వీలైనంతగా లైట్‌ ఫుడ్‌ తీసుకోవడం మంచిందని చెబుతున్నారు వైద్యులు. ప్రోటీన్లు, విటమిన్‌ ఫుడ్‌ ఉండేలా చూసుకోమని డైటీషియన్లు చెబుతున్నారు. కరోనా మహమ్మారి లాంటి సమయంలో డ్రై ఫ్రూట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

ఇవి ఆకలిని తీర్చడంతో పాటు బాడీలోని చెడు కొవ్వును కూడా తగ్గిస్తాయి. అలాగే బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్స్ బఠాణీల్లో ఉంటాయి. కేలరీలు కూడా తక్కువే. తక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్, ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాకొలెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎక్కువ పని ఒత్తిడిలో ఉండి అలసిపోయినప్పుడు ఓ డార్క్ చాకొలెట్ తింటే చాలు వెంటనే మూడ్ మారుతుందట. ఈ చాకొలెట్లు అప్పడప్పుడు తినడం మంచిది. అలా అని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version