ఉపవాసం ఉంటే కొందరు పండ్లు తినొచ్చని చెబుతుంటారు. మరికొందరు అసలేమీ తినొద్దని అంటుంటారు. అసలు ఉపవాసం ఎలా చేయాలి. ఆ రోజు తినాలా? వద్దా? తెలుసుకుందాం.
కొందరు వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటారు. ఇంకొందరు…మహాశివరాత్రి, ఏకాదశి తిథులు, ఇతర ప్రత్యేక మాసాలు, పర్వదినాల్లో ఉపవాసం ఉంటారు. కానీ ప్రత్యేక పర్వదినాల్లో పూజలతో స్తోత్ర పారాయణాలతో దైవ చింతనలో గడపాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటప్పుడు ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం భావించారు. కానీ అసలు ఉపవాసం అంటే ఏమిటి. దైవ చింతనకు దగ్గరంగా ఉండటం ఉపవాసం అంతేకానీ…ఏమీ తినకుండా శరీరాన్ని శుష్కింపచేయడం కాదని మన సంప్రదాయం నొక్కి మరీ చెబుతోంది. కడుపునిండా తిండి…కండినిండా నిద్ర. ఇక ప్రక్రుతి అవసరాల కోసం ఒకటికి రెండు సార్లు వెళ్లాల్సి ఉంటుంది.
ఇక భోజనం రెడీ చేసుకునేందుకు కొంత సమయం పెట్టుకోవాలి. వీటన్నింటి కారణంగా దైవచింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు. కావునా ఉపవాసం రోజున భోజనం మానేసే ఆచారం మొదలయ్యింది. ఇప్పటి దేశకాల పరిస్థితుల ద్రుష్ట్యా ఉపవాసం చేయాలనుకున్నప్పుడు పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం పరిమితంగా తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం దైవచింతనలో గడపవచ్చు. కానీ ఉపవాసం పేరుతో ఒక రోజు భోజనం మానేస్తే…ప్రయోజనం కూడా ఉంది.
మనిషికి విరామం అవసరమైనట్లే…జీర్ణకోశానికి కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కల్పించడం తప్పనిసరి. వారానికో, పక్షానికో, నెలకో ఒక రోజు లేదంటే ఒక పూజ ఆహారం తీసుకోకుండా ఉంటే జీర్ణకోశానికి విశ్రాంతి లభిస్తుంది. దీంతో జీర్ణక్రియ మరింత చురుగ్గా సాగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉపవాసం పేరుతో అప్పుడప్పుడూ భోజనం మానేయడం కూడా మంచిదే.