కోడి ముందా.. గుడ్డు ముందా..? ఈ ప్రశ్న మనం ఎన్నోసార్లు వినే ఉంటాం ఆ విషయం గురించి చాలా మందితో వాదించి ఉంటాం. కొంతమంది కోడి ముందు అని వాదిస్తే మరి కొంతమంది గుడ్డు ముందు అని వాదిస్తూ ఉంటారు. కేవలం సామాన్యులను మాత్రమే కాకుండా అనుభవజ్ఞులైన పండితులను కూడా ఈ ప్రశ్న ఆలోచింపజేసింది. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం ఉందా అంటే చాలామంది లేదనే చెబుతారు. కానీ ప్రశ్నకు సమాధానం ఉందండోయ్. శాస్త్రవేత్తలు ఈ విషయంపై అధ్యయనం జరిపి ఒక విషయాన్ని తెలిపారు.
ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మొదట గుడ్లు పెట్టడానికి బదులుగా చిన్న పిల్లలకు జన్మనిచ్చి ఉండవచ్చు అని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధన సూచించింది. ఈ ముగింపు 51వ శిలాజ జాతులు 29 జీవజాతులపై చేసిన అధ్యయనంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. వీటిని అండాశయ జాతులు లేదా వివిపారస్ గా వర్గీకరించవచ్చు. అండాశయ జాతులు గట్టి లేదా మృదువైన పెంకులతో కూడిన గుడ్లు పెట్టడానికి ప్రసిద్ధి చెందాయి. వివిపారస్ జాతులు చిన్న పిల్లలకు జన్మనిస్తాయి. ఈ కొత్త పరిశోధనలు నేచర్ ఎకాలజీ ఎవల్యూషన్ జనరల్ లో ప్రచురించబడ్డాయి. గుడ్డు లోపల రక్షితపొర అయిన అమ్నియోన్ లో పిండం లేదా అభివృద్ధి చెందే సకశేరుకాల సమూహాన్ని అమ్నియోట్స్ అని పిలుస్తారు.
కాగా ఇప్పటివరకు గట్టి పెంకుతో కూడిన గుడ్డు వీటి విజయానికి కీలకం గా భావించబడింది. కానీ నేచర్ ఎకాలజీ ఎవల్యూషన్ లో ప్రచురించబడిన పరిశోధనలు అమ్నియోట్స్ పరిణామ శాఖలో ఉన్న క్షీరదాలు లెపిడోసౌరియా అనగా బల్లుల జాతి, ఆర్కోసౌరియా అనగా డైనోసార్ ముసలి పక్షులు. పూర్వీకులలో వివి పారిటి పొడిగించిన పిండ నిలుపుదలని వెల్లడిస్తున్నాయి. గట్టి పెంకు గుడ్డు తరచుగా పరిణామంలో గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాగా కప్పలు సాలమండర్లు వంటి ఆధునిక ఉభయచరాల మాదిరిగానే అవి ఆహారం సంతానోత్పత్తి కోసం నీటిలో లేదా సమీపంలో నివసించాల్సి వచ్చింది. అనేక బల్లులు పాములు అనువైన పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయి. అండాశయం వివిపారీటీ రెండింటిని ప్రదర్శిస్తాయి.