Dandiya Vs Garba : గార్బా, దాండియా జానపద నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవి రెండు కూడా గుజరాతీ నృత్యాలే. మహిషాసురుడిని వధించే క్రమంలో తొమ్మిదిరోజుల పాటు సాగిన దుర్గామాత యుద్ధ రీతిని వివరించేవిగానే ఈ నృత్యాలు సాగుతాయి. అందుకే ఉత్తర భారత దేశంలోని గుజరాత్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో నవరాత్రుల వేడుకలలో అమ్మవారి భక్తులు భక్తిభావంతో గార్బా, దాండియా నృత్యాలు చేస్తుంటారు. ఈక్రమంలో రంగురంగుల ఎంబ్రాయిడరీతో ఉండే దుస్తులను ధరిస్తారు.
భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా..
ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ డ్యాన్స్ లు ఫేమస్ అయ్యాయి. పెళ్లిల్లు, ఇతర వేడుకల్లోనూ ఈ డ్యాన్స్ చేస్తున్నారు. భాషా, ప్రాంతంతో సంబంధం లేకుండా దాండియా, గార్బా డ్యాన్సులు అంతగా జనం మనసును గెల్చుకున్నాయి. గుజరాతీ కమ్యూనిటీకి సంబంధించిన వేడుకలలో గార్బా వెరీ స్పెషల్ గా ఉంటుంది. పెద్ద దీపపు సెమ్మె లేదా దుర్గామాత విగ్రహం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ఈ డ్యాన్స్ ను ప్రదర్శిస్తుంటారు. ఒకరినొకరు దాటుకొని తిరుగుతూ చేసే గ్రూప్ డ్యాన్స్ ఇది. లయబద్ధమైన దాండియా కర్రలతో దరువు వేస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రదర్శించే నృత్యం దాండియా.
We’re now on WhatsApp. Click to Join.
దాండియా, గార్భా తేడాలివీ..
కీర్తనలు, భజనల వేళ భక్తితో చేసే డ్యాన్స్ గార్భా. గార్భా డ్యాన్స్ ను చేతులు ఉపయోగించి చేస్తారు. ఈ డ్యాన్స్ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ.. కాళ్లు చేతులతో రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అమ్మవారికి హారతి పట్టిన తర్వాత ఆనందంగా చేసే నృత్యం దాండియా. రంగురంగుల కర్రలు ఉపయోగించి దాండియా ఆడతారు. దాండియా ఆడే గ్రూప్ లో సరి సంఖ్యలో సభ్యులు ఉండాలి. గార్బాకు అలాంటి రూల్ ఏదీ లేదు. గార్బా పాటలన్నీ దుర్గామాతను స్తుతిస్తూ ఉంటాయి. ఇక దాండియా పాటలు కృష్ణ లీల గురించి ఉంటాయి. గార్బా, దాండియా రెండు కూడా దుర్గా నవరాత్రుల వేళ వాడుకలో (Dandiya Vs Garba) ఉన్నాయి.