Site icon HashtagU Telugu

Bicycle: వామ్మో.. ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్.. దీని బరువు ఎంతంటే?

Kleine Johanna Bicycle

Kleine Johanna Bicycle

Bicycle: మామూలుగా కొత్త మోడల్ తో కూడిన ఎన్ని రకాల వాహనాలు వచ్చిన కూడా సైకిల్ మాత్రం అదే మోడల్, అంతే బరువు ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సైకిల్ లో కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా మరో బరువైన కొత్త మోడల్ లాంటి బాహుబలి సైకిల్ అందుబాటులోకి వచ్చింది. రీసెంట్ గా జర్మనీలో డుసెల్డోఫ్ పట్టణంలో ‘సైక్లింగ్ వరల్డ్ బైక్ షో’ నిర్వహించారు.

ఇక ఆ షోలో పలు మోడల్స్ తో కూడిన వివిధ రకాల సైకిల్లు ప్రదర్శనలో ఉంచారు. అయితే బుల్డోజర్ పరిమాణంలో ఉన్న ‘క్లైన్ జొహాన్నా’ అనే పేరుతో ఉన్న ఒక సైకిల్ కూడా అక్కడ ప్రదర్శనలో ఉండగా దానిని చూసి అక్కడ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ఆ బాహుబలి సైకిల్ ను జర్మనీలో కోథెన్ పట్టణానికి చెందిన సెబాస్టియన్ బ్యూట్లర్ అనే వ్యక్తి తయారు చేశాడు.

ఈయన బాల్యం నుండే తుక్కు దుకాణంలో దొరికే వ్యర్ధాలతో సైకిల్ తయారు చేసి అందరిచే ప్రశంసలు అందుకున్నాడు. అలా అప్పటినుంచి ఏదో ఒకటి తయారు చేయాలన్న ఆలోచనలు ఆయనలో ఉండేవి. అలా 2011లో ఆయన ఓసారి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ సమయంలోనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక చాలా సంవత్సరాల నుంచి బాహుబలి లాంటి సైకిల్ ను తయారు చేయాలని కోరిక ఆయనలో ఉండటంతో..

అలా మూడేళ్ల పాటు కష్టపడి క్లైన్ జొహన్నాను తయారుచేశాడు. దానికోసం 2500 గంటల సమయాన్ని కేటాయించాడు. ఆ సైకిల్ తయారు చేసిన సమయంలో తన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానిని ఎంత ఆపమని కోరినా కూడా ఆయన వినకుండా ఆ సైకిల్ తయారు చేశాడు అని తెలిసింది. ఇక ఈ సైకిల్ బరువు 2177 కేజీలు ఉంటుందట.

ఇక ఆ సైకిల్ లో ఉపయోగించిన వస్తువులన్నీ తుక్కు దుకాణం నుండి తెచ్చిన వ్యర్ధపదార్థాలే. ఈ సైకిల్ 5 మీటర్ల పొడవు, రెండు మీటర్ల ఎత్తుతో పాటు.. ముందు, వెనుక భారీ టైర్లు అమర్చారు. ఇక మధ్యలో సపోర్టు కోసం ఒక మీడియం సైజులో ఉన్న టైర్ ను అమర్చారు. ఇక సైకిల్స్ సులువుగా కదిలేందుకు ఒక ట్రక్కు గేర్ బాక్స్ ను, మామూలు గేర్ సైకిల్ వ్యవస్థతో అనుసంధానం చేశారు.

ఇక ఈ సైకిల్ ను ముందుకు కదపాలంటే 35 గేర్లు.. వెనుకకు మల్లాలంటే ఏడు గేర్లు ఉపయోగించాలి. ఇక ఈ సైకిల్ కు మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే 15 టన్నుల్లోపు బరువైన వాహనాలు ఏవి కట్టిన ఈ సైకిల్ తేలికగా తీసుకెళ్తుంది అని తెలిసింది. ఇక ఈ సైకిల్ కి లోపల భాగం ఒక ఇంజన్ కూడా ఉండగా అది ఆల్టర్నేటర్ గా తిరగడానికి మాత్రమే సహాయం చేస్తుంది అని తెలిసింది. దాని సహాయంతో మొబైల్ ఫోన్ చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చట. ఇక ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సైకిల్ ను ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్ గా రికార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్మనీ గుర్తించింది.

Exit mobile version