Site icon HashtagU Telugu

Deer-Leopard: వామ్మో.. తెలివైన జింక.. ప్రాణాలు పోయినట్లు నటించి చిరుత నుండి ఎలా తప్పించుకుందో చూడండి?

Nsfawn20150603abyrum E1434574731584

Nsfawn20150603abyrum E1434574731584

Deer-Leopard: మామూలుగా చిరుత పులికి జింక కనిపిస్తే చాలు ఆరోజు దానికి పండగ అని చెప్పాలి. కానీ దొరికిపోయిన జింకకు మాత్రం అదే చివరి రోజు. పొరపాటున పులి కంట పడితే ఆ జింక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే అడివిలో ఉండే జంతువులు క్రూర జంతువుల భయంతో బ్రతుకుతూ ఉంటాయి. ఎక్కడ ఏ క్రూర జంతువు వచ్చి తమను మింగేస్తుందో అని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి.

కానీ కొన్ని కొన్ని సార్లు దురదృష్టం కొద్దీ క్రూర మృగానికి చిక్కే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఆ సమయంలో సచ్చినట్లు వాటి చేతిలో అవి చచ్చిపోవాల్సిందే. కానీ కొన్ని కొన్ని సార్లు అదృష్టం బాగుండి అవి తప్పించుకుంటాయి. అయితే తాజాగా ఓ జింక కూడా చిరుత నుంచి తప్పించుకోగా.. ఆ తప్పించుకోవడానికి అది చేసిన ప్లాన్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఓ అడవిలో ఓ చిరుతకు జింక కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని తినాలని ఫిక్స్ అయింది. ఇక జింక పరిగెత్తాలన్న కూడా దారి లేకపోవడంతో అది అలాగే చచ్చిపోయినట్లు డ్రామా చేసింది. ఇక చిరుత జింకను పంజా కింద నొక్కి పెట్టింది. ఇక ఆ చిరుత దానిని తినాలని ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడికి హైనా పరిగెత్తుకుంటూ వచ్చింది.

ఇక హైనా చిరుతను అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేసింది. చిరుత దానిని తరిమి కొడుతున్న సమయంలో వెంటనే అప్పటివరకు చనిపోయినట్లు నటించిన జింక వెంటనే పరుగులు తీసింది. ఇక హైనా కూడా దాని వెంట పరిగెత్తిన కూడా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ జింక అక్కడినుంచి దూరంగా పారిపోయింది. ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆ జింక చనిపోయినట్లు చేసిన డ్రామాలు చూసి వామ్మో తెలివైన జింక అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version