Site icon HashtagU Telugu

Kieron Pollard Retires: అంతర్జాతీయ క్రికెట్ కు పొల్లార్డ్ గుడ్ బై

pollard

pollard

వెస్ట్ ఇండీస్ స్టార్ ఆల్ రౌండర్ , ఆ జట్టు వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ కిరన్ పొల్లార్డ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇంటర్ నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. 34 ఏళ్ల పొల్లార్డ్ ఆల్ రౌండర్ గా తనదయిన ముద్ర వేశాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. దాదాపు 15 ఏళ్లు విండీస్ జాతీయ జట్టుకు ప్రాతనిథ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాననీ భావోద్వేగానికి గురయ్యాడు. 2007 లో తన చిన్నప్పటి హీరో లారా కెప్టెన్సీ లో అరంగేట్రం చేయడం ఎప్పటికీ మర్చిపోలేని విషయంగా చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ ఏదైనా జట్టు కోసం 100 శాతం ప్రదర్శన ఇచ్చేందుకే ఎప్పుడూ ప్రయత్నించానని పొల్లార్డ్ వ్యాఖ్యానించాడు.

పొల్లార్డ్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ 123 వన్డేలు, 101 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. వన్డేల్లో 2706 , టీ ట్వంటీల్లో 1569 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 55 , టీ ట్వంటీల్లో 42 వికెట్లు పడగొట్టాడు. అయితే 15 ఏళ్ల కెరీర్ లో ఈ విండీస్ ఆల్ రౌండర్ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. నిజానికి ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసే వరకూ పొల్లార్డ్ కొనసాగుతాడని భావించారు. అయితే అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై టీమ్ కి ఆడుతున్న పొల్లార్డ్ మునుపటిలా
రాణించలేకపోతున్నాడు.