పుష్ప (Pushpa) మూవీ లో అల్లు అర్జున్ ఎర్రచందనాన్ని ఏ రేంజ్ లో స్మగ్లింగ్ చేసాడో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) చూపించాడు..కానీ ఏపీలో అంతకు మించి కేటుగాళ్లు గంజాయి , ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా గంజాయి ఫై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గంజాయి (Ganja ) విషయం లో ఎక్కడ తగ్గద్దని..దీని వెనుక ఎవరు ఉన్న..ఎంత పెద్ద నేతలు ఉన్న వదిలేది లేదని ఆదేశాలు జారీ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో పోలీసులు ఎక్కడిక్కడే నిఘా పెట్టి ప్రతి రోజు లక్షల రూపాయిలు విలువ చేసే గంజాయి ని పట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. లారీ ఫై టాప్ లో ఎవరికీ కనపడకుండా..అసలు ఆ ఆనవాలే లేకుండా తరలించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అసలు ఇలాంటి ఐడియా లు ఎలా వస్తున్నాయిరా అంటూ ఒకిత్త ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
తూర్పు గోదావరి జిల్లాలో లారీలో అక్రమంగా వందలాది గంజాయి బ్యాగులు తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. #police #eastgodavari #AndhraPradesh #HashtagU pic.twitter.com/xgljYh2fkP
— Hashtag U (@HashtaguIn) August 31, 2024
Read Also :