West Bengal: 11 కి చేరిన బెంగాల్ మృతుల సంఖ్య

బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లు యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
West Bengal

New Web Story Copy 2023 07 08t142108.848

West Bengal: బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అధికార పార్టీ టీఎంసీ, ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌లు యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. బాంబు దాడులు, బుల్లెట్ల వ‌ర్షంతో బెంగాల్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఈ రోజు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే పోలింగ్‌ మొదలుకావడమే తరువాయి హింసాకాండ ప్రారంభమైంది. గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్‌, పంచాయతీ సమితిల్లోని దాదాపు 64 వేల స్థానాలకు ఓటింగ్‌ ప్రారంభమైన వెంటనే వివిధ జిల్లాలలో బూత్‌ల వద్ద దుండగులు వీరంగం సృష్టించారు. కోన్ని చోట్ల బూత్ లను దోపిడీ చేశారు. అడ్డుకున్నవారిపై దాడికి పాల్పడ్డారు. బాంబులు, బుల్లెట్లతో స్థానికుల్ని భయాందోళనకు గురి చేశారు.

కలకత్తా హైకోర్టు సూచనల మేరకు ఎన్నికల నేపథ్యంలో 822 కేంద్ర బలగాలను మోహరించారు. అయినప్పటికీ హింసాత్మక పోలింగ్ చోటుచేసుకుంది. గత రాత్రి నుంచి జరిగిన హింసాకాండలో 11 మంది మృతి చెందగా, బాంబు పేలుళ్లలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో టిఎంసికి చెందిన ఆరుగురు సభ్యులు, బిజెపి, సిపిఐ(ఎం) మరియు కాంగ్రెస్‌లకు చెందిన ఒక్కో కార్యకర్త మరియు స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు ఉన్నారు.

Read More: Elections Prepone : మోడీ “ముంద‌స్తు“ దూకుడు

  Last Updated: 08 Jul 2023, 02:24 PM IST