Site icon HashtagU Telugu

West Bengal flood: విజయ దశమి విషాదం.. పశ్చిమ బెంగాల్‌ లో 8 మంది మృతి!

Dasara

Dasara

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని మల్బజార్ వద్ద మాల్ నదిలో ఆకస్మిక వరద కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇంకా చాలా మంది తప్పిపోయారని సమాచారం. విజయ దశమి సందర్భంగా దుర్గా విగ్రహాల నిమజ్జనం కోసం వేలాది మంది గ్రామస్తులు బుధవారం సాయంత్రం మల్ నది ఒడ్డున గుమిగూడినప్పుడు ఆకస్మిక వరద వచ్చింది.

వరదల కారణంగా తపన్ అధికారి (72) సుభాసిష్ రాహా (63), రూమూర్ సాహా (42), బివా దేబీ (28), సుష్మితా పొద్దర్ (22), సోభోంద్వీప్ అధికారి (20), ఉర్మి. సాహా (13), అనాస్ పండిత్ (8) చనిపోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనతో బాధపడ్డాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం’అని ట్విట్టర్ లో తెలిపారు. జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపాలున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.