CBN: 1000 కిలోల పూలతో చంద్రబాబుకు స్వాగతం

  • Written By:
  • Updated On - June 13, 2024 / 10:24 PM IST

CBN: ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆయన ఉండవల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరగా.. దారి పొడవునా అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించారు. వెలగపూడి దగ్గరున్న వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా 1000 కిలోల పూలతో స్వాగతం పలికారు. అమరావతికి పూర్వవైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవాళ శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత సాయంత్రం 4.41 గంట‌ల స‌మ‌యంలో ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యానికి వెళ్లి పూర్తిస్థాయిలో బాధ్య‌త‌లు తీసుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న 5 ముఖ్య‌మైన అంశాల‌కు సంబంధించిన ఫైళ్ల‌పై సంత‌కాలు చేశారు. వీటికి సంబంధించిన అంశాల‌ను కూడా.. మంత్రి వ‌ర్గ స‌భ్యుల‌ను చంద్ర‌బాబు కూలంక‌షంగా వివ‌రించారు. వీటిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన కీల‌క హామీలే ఉండ‌డం విశేషం.