Site icon HashtagU Telugu

Delhi: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత‌

Night Curfew

Night Curfew

ఢిల్లీ లో వారంత‌పు క‌ర్ఫ్యూ ఎత్తివేయాల‌ని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నిర్ణయించింది. దీంతో పాటు నగరంలో అనవసరమైన దుకాణాలను తెరవడానికి సరి-బేసి విధానాన్ని కూడా ఎత్తి వేయాల‌ని నిర్ణ‌యించింది. అలాగే రెస్టారెంట్లు, బార్‌లు, సినిమా హాళ్లు, థియేటర్‌లను 50% సామర్థ్యంతో తిరిగి తెరవడానికి అనుమతించిందిలెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నేతృత్వంలో జరిగిన డీడీఎంఏ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే సమావేశంలో పాఠశాలలను పునఃప్రారంభించేందుకు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

50% మంది ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తెరవడానికి అనుమతించినట్లు వారు తెలిపారు. వివాహ వేదికలు దాని సామర్థ్యంలో 50% అతిథులు 200 మందికి మించకుండా అనుమతించబడ్డాయి. ఇప్పటి వరకు ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉండేది. రాత్రి 10.00 గంటల నుంచి ఉద‌యం 5.00 గంట‌ల వరకు క‌ర్ఫ్యూ కొనసాగుతుంది.