Site icon HashtagU Telugu

Telangana: వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో వడగండ్ల వర్షాలు?

0.43836400 1641803424 0

0.43836400 1641803424 0

Telangana: గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా వడగండ్ల పడుతున్నాయి. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా ఈ వడగండ్ల వానల వల్ల ఎన్నో మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. రైతులకు చేతికందిన పంటలు ఈ వర్షాల కారణంగా మొత్తం పాడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల్లో కోట్లలో నష్టాలను తెచ్చిపెట్టింది ఈ వడగండ్ల వాన. ఇది ఇలా ఉంటే తాజాగా వాతావరణం శాఖ తెలంగాణలో వడగండ్ల వానలు పడబోతున్నట్లు తెలిపింది.

తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 24 గంటల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిపింది. అదేవిధంగా ఈనెల 25, 26,27 తేదీలలో వడగండ్ల వానలు పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలిపింది. తెలంగాణలోని ఉత్తర ఈశాన్య జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిపింది వాతావరణ శాఖ. రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో సాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలో కురిసిన వడగండ్ల వానల వల్ల రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మామిడి, పచ్చిమిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది చాలవు అన్నట్లు తాజాగా మరోసారి వడగండ్ల వానలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాలో ని రైతులు మూగజీవాలను పంటలను కోల్పోయి గుండెలు వెలసేలా రోదిస్తున్నారు. కేటీఆర్ వారిని పరామర్శించారు.