ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ శ్రీలంక నుండి తమిళనాడు, రాయలసీమ మరియు తెలంగాణ మీదుగా ఈశాన్య మధ్యప్రదేశ్ వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా బుధ, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అకాల వర్షాలతో అన్నదాతలు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలు కురిశాయి.
Rain Alert : ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ

Hyd Rains Imresizer