ఏపీలో ఈ రోజు (గురువారం) 15 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. శుక్రవారం కూడా ఈ ప్రభావం 302 మండలాల్లో ఉందని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లాలోని అనకాపల్లి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు, కశింకోట, కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం, సబ్బవరం మండలాలు, కోట్‌నందూరు, తుని మండలాలు, కోటవలస జిల్లాలోని జామి, కోటవలస, విశాఖపట్నంలోని పద్మనాభం మండలాల్లో గురువారం వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.అయితే బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.4 డిగ్రీల సెల్సియస్, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.1 డిగ్రీల సెల్సియస్, ఏలూరు జిల్లా కమ్మవరపుకోట మండలంలో 43 డిగ్రీల సెల్సియస్, 6 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి.
Andhra Pradesh : ఏపీలో రెండు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం – ఐఎండీ
ఏపీలో ఈ రోజు(గురువారం) 15 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్

Heatwave
Last Updated: 01 Jun 2023, 06:57 AM IST