Site icon HashtagU Telugu

Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Weather Forecast

Weather Forecast

Weather Forecast: గత కొద్దీ రోజులుగా దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే మాసంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్‌లను ప్రభావితం చేసే ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షపాతం ఏర్పడిందని తెలిపింది. శని మరియు ఆదివారాల్లో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అంతేకాదు ఖమ్మం, నల్గొండ మినహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఖమ్మం, హైదరాబాద్ మరియు మహబూబ్‌నగర్ వంటి నిర్దిష్ట జిల్లాలు రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Also Read: Russia Vs Ukraine War : రష్యా – ఉక్రెయిన్ వార్‌కు రెండేళ్లు.. సాధించింది అదే !