Minister Roja: ఎస్.బి.ఆర్ పురంలో చిన్నారులకు నివాళులర్పించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అన్నారు. వడమాలపేట మండలం ఎస్.బి.ఆర్ పురం గ్రామంలో చెరువులో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు శుక్రవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. ఎస్.బి.ఆర్ పురం గ్రామానికి చెందిన డాక్టర్ బాబు విజయశాంతిల కుమార్తెలు ఉషిక, చరిత, రిషికలు స్థానిక శివాలయంలో పూజ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది.
ఈ నేపథ్యంలో ఆర్.కే రోజా చిన్నారుల మృతదేహాలకు పుష్పమాలతో నివాళులర్పించారు. బాధిత తల్లిదండ్రులు డాక్టర్ బాబు, విజయ దంపతులను పరామర్శించారు. డాక్టర్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని, ఆర్థికంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ఈ నేపద్యంలో చిన్నారుల మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగాని గురై కన్నీటి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కోరారు.