Site icon HashtagU Telugu

Komatireddy: చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం : మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

Komatireddy:  ‘‘రాబోయే పదిసంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, కార్యకర్తలందరు కష్టపడి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిటని గెలిపించుకుందాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లోనే అంతం అయిపోతుందంటే అర్థం అయిపోతుంది, పదేండ్లు పరిపాలన చేసిన కూడ కింది స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన నాయకులు వరకు వారి పార్టీ వీడుతున్రు అంటే వాళ్ళ కుటుంబ పాలనే కారణం. దేశంలో ఏ పార్టీ కూడ ఇంతలా దిగజారి పోలేదు.. కార్యకర్తలతో కలిసి పనిచేసే పార్టీలు నిలదొక్కుకుంటాయి, కాంగ్రెస్ పార్టీ కూడ కార్యకర్తల పార్టీనే, పదేండ్లు అధికారంలో లేకున్నా కార్యకర్తల కృషివల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చినం’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి కోమటిరెడ్డి ఆయా పార్లమెంట్ స్థానాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆయన. చరిత్రలో నిలిచిపోయేలా తుక్కుగూడ సభ నిర్వహిస్తాం. సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివస్తామని కార్యకర్తలే చెప్తున్నారు. వారి ఉత్సాహం, ప్రజల స్పందన చూస్తుంటే తుక్కుగూడ సభ పది లక్షలకు మించిపోయేలా ఉంది. ఈనెల 6న నిర్వహించే తుక్కుగూడ జనజాతర మహాసభకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు.

‘‘పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి మ్యానిఫెస్టోని ఈ సభా వేదికగా పెద్దలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే విడుదల చేస్తారు. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం.. తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయడం, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం. ఈ నెల 8న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తొలి సన్నాహక సమావేశం.. ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నాం పల్లి లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటుచేస్తున్నాం. అలాగే క్రమేనా 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటాం’’ అని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.