Site icon HashtagU Telugu

Ponnam: బెస్ట్ రవాణా పాలసీని తెలంగాణలో అమలుచేస్తాం: మంత్రి పొన్నం

Key Advice To farmers

Key Advice To farmers

Ponnam: రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసి పై రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో స్టడి టూర్ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యంగా కేరళ ,కర్ణాటక ,మహరాష్ట్ర , ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల పై నాలుగు బృందాలుగా పర్యటిస్తున్నారు. ఒక డీటీసి, ఆర్టీవో, ఎంవిఐ లు ఒక్కో బృందంగా ఏర్పడి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారన్నారు.

రవాణా శాఖ కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో వాడుతున్న సాంకేతిక టెక్నాలజీ ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్,వెహికిల్ టారిఫ్ ,వెహికిల్ ట్రాకింగ్,వెహికిల్ రిజిస్ట్రేషన్, వెహికిల్ ఫిట్నెస్ , డ్రైవింగ్ టెస్టింగ్ , లైసెన్స్ ఇష్యూయింగ్ , సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ,రోడ్డు భద్రత పై అవగాహన తదితర వాటికి ఉపయోగిస్తున్న అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఎలా ఉంది.అందులో బెస్ట్ పాలసీ లో తెలంగాణలో ఉపయోగించేందుకు ముఖ్య అధికారులతో ఈ స్టడీ టూర్ కొనసాగుతుందన్నారు.

రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసిన వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాలసీ లపై ప్రభుత్వం అధ్యయనం చేసి అందులో బెస్ట్ పాలసీ నీ తెలంగాణ లో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రకటన లో తెలిపారు.వీటితో పాటు ఒక్కో రాష్ట్రంలో ఒక్క రకమైన పన్నుల వ్యవస్థను కలిగి ఉంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్న మార్గాలు, అక్కడ అమలవుతున్న వాటిలో మంచి టాక్సేషన్ ఇక్కడ అమలయ్యేలా చూస్తామని మంత్రి అన్నారు.