BRS: మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2001 లో తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం అయిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అవుతోందని, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు చేస్తున్నాం అని అన్నారు. జూన్ 1 వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు కేసీఆర్ చేరుకుని నివాళులు అర్పిస్తారని, గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి సెక్రటేరియట్ ఎదురుగా వున్న అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆయన అన్నారు.
పది వేల మందితో ర్యాలీ నిర్వహిస్తాం. జూన్ 2 వ తేదీన జాతీయ జెండా,పార్టీ జెండాను తెలంగాణ భవన్ లో ఎగురవేస్తాం. జూన్ 2 వ తేదీన తెలంగాణ భవన్ లో సమావేశం,ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుందని, జూన్ 3 వ తేదీన జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండాలు,పార్టీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఎగురవేస్తారు. ఆసుపత్రులు,అనాథ శరణాలయాల్లో స్వీట్లు,పండ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది అని అన్నారు.