BRS Party: నిరుద్యోగుల సమస్యల పై పోరాడుతాం : ఏనుగుల రాకేష్ రెడ్డి

  • Written By:
  • Publish Date - June 26, 2024 / 09:40 PM IST

BRS Party: నిరుద్యోగుల సమస్యల పై గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను గాంధీ హాస్పిటల్ కి వెళ్లి, కలిసి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, తన పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది. తన దీక్షకు BRS అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇవ్వడం జరిగిందని BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు.

ప్రజా పాలన పేరుతో మూడొద్దులు మురిపించి పాలన అటుకెక్కించారు. విద్యార్థులు, నిరుద్యోగులు గత 4 నెలలుగా అనేక సమస్యల మీద ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. నిరుద్యోగులు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసినా పట్టింపు లేదు. గురుకుల టీచర్లు, నర్సులు మంత్రుల, ముఖ్యమంత్రి ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్న సోయి లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావు గారు ప్రభుత్వానికి లేఖ రాసినా కనీస స్పందన లేదు’’ అని ఆయన అన్నారు.

డిమాండ్స్ :-

1. గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలి.

2. గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలి.

3. గురుకుల టీచర్లను వెంటనే నియమించాలి.

4. ఏడాదిలోగా 2 లక్షలు ఉద్యోగాలిస్తామని, జాబ్ కేలండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలలైనా జాబ్ కేలండర్ ఎందుకివ్వలేదు? ఆ హామీని నిలబెట్టుకోవాలి.

5. కనీసం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలి.

6. జీవో 46 ను రద్దు చెయ్యాలి. సూపర్ న్యూమరికల్ పోస్ట్ ల ద్వారా జీవో 46 బాధితులకు న్యాయం చెయ్యాలి.