Revanth calls: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం!

తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు.

  • Written By:
  • Updated On - December 31, 2021 / 03:17 PM IST

తెలంగాణ లో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఎవరు సంతోషంగా లేరని టీపీసీసీ చీఫ్ రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వల్ల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామనే సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నారని రేవంత్ తెలిపారు. పాలకుల నిర్ణయాలు రాష్ట్రాన్ని అతలా కుతలం చేసేలా ఉన్నాయని, ఉద్యోగుల, ఉపాధ్యాయ నియామకంలో స్థానికత ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం ఉద్యోగుల వైరుధ్యాల వల్లనేనని రేవంత్ తెలిపారు. జీవో నెంబర్ 317 రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధమని, పాత ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగా అయినా విభజించినా పుట్టి పెరిగిన చోట ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విద్యార్ధులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను పాలకులు రోడ్డెక్కి లా చేశారని, ధర్నాలు చేస్తే, రోడ్లపై ఈడ్చుకొని పోతున్నారని, ప్రభుత్వాల విధానాల వల్ల ఉపాధ్యాయులు చనిపోతున్నారని రేవంత్ తెలిపారు.

ప్రభుత్వ తప్పుడు నిర్ణయం వల్ల విద్యాశాఖ అధికారులు చనిపోతే విద్యా శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలని రేవంత్ సూచించారు. కేసీఆర్, కేటీఆర్ లని ఉరి తీసినా తప్పు లేదని, కేటీఆర్ ని అడ్డుకోండని రేవంత్ పిలుపునిచ్చారు.
తిక్క రెగితే జైల్ భరో చేస్తామని, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని, నూతన సంవత్సరంలో తప్పకుండా జైల్ భరో చేస్తామని రేవంత్ ప్రకటించారు. కేసీఆర్ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా మార్చారని, పోలీసులతో తమని అడ్డుకోవాలని చూస్తున్నారని, దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని రేవంత్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్స్ శ్రేణులు, విద్యార్థి,యూత్ కాంగ్రెస్ నేతలుపార్టీకి ఆర్మీ లాగా మారి మంత్రులను అడ్డుకోవాలని రేవంత్ సూచించారు.