AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ గొప్ప విషయం అని అన్నారు. 2029 వరకు పథకాన్ని పొడిగించడాన్ని అభినందిస్తున్నామని, విద్యుత్ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్ మంచి పథకంఅని, ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు చేయూత ఇస్తున్నారని అన్నారు. పర్యటక రంగానికి అండగా ఉండేలా కేంద్రం సహకరిస్తోందని, భారత్‌లో ఇతర పట్టణాలకు మెట్రో విస్తరించడం అభినందనీయని నాదెండ్ల మనోహర్ అన్నారు.
కాగా 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాంమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేది. కానీ, మేం దాన్ని అమలు చేసి చూపుతున్నాం. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం. రత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటల్ ఇండియా చాలా కీలకం’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
