Site icon HashtagU Telugu

Exit Poll Results: ఈ ఎన్నికల్లో ఖచ్చితమైన ప్రీ పోల్స్ రిజల్ట్స్ ఇచ్చాం : చాణక్య ముఖేష్

Chankaya

Chankaya

Exit Poll Results: ప్రస్తుత తెలంగాణ ఎన్నికలు సామాన్య ప్రజల్లోనే కాకుండా రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తిని రేపాయి. అయితే ఈ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పాయి. అందులో చాణక్య స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ ఇచ్చిన ఫలితాలు కూడా నూటికి నూరుశాతం ఖచ్చితమైనవని నిరూపించాయి. ఈ సందర్భంగా చాణక్య ముఖేష్ సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో సర్వే చేశాం. ప్రతి నియోజకవర్గానికి 1000 శాంపిల్స్ సేకరించి ఖచ్చితమైన పలితాలను వెల్లడించామని ఆయన తెలిపారు. ఇతర సంస్థలకు భిన్నంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల నాడిని ముందే పసిగట్టామని, మేం చెప్పిన చోట్లా అభ్యర్థులు గెలిచారని (రెండు స్థానాలు మాత్రమే అటు ఇటు అయ్యాయని) ఆయన తెలిపారు. మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కరెక్ట్ ప్రీ పోల్ రిజల్ట్ ఇచ్చామని, భవిష్యత్తులో కూడా ఇదే రిజల్ట్స్ ఇస్తామని ఆయన తెలిపారు.