Kadiyam Srihari: లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టం : కడియం

లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టబోమని శ్రీహరి స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Kadiyam

Kadiyam

Kadiyam Srihari: బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రాజయ్యపై పైచేయి సాధించి టికెట్ దక్కించుకున్న ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టబోమని శ్రీహరి స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో దేవాదుల ఎత్తిపోతల పథకం గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. లక్ష పైచిలుకు ఎకరాలకు సాగునీరు లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారని శ్రీహరి చెప్పారు. అదే సందర్భంలో లింగంపల్లి రిజర్వాయర్ ప్రస్తావన కూడా సీఎం తెచ్చారని.. అయితే అది అవసరం లేదని తాను చెప్పానని వెల్లడించారు. దీంతో సీఎం సైతం అదే అభిప్రాయంతో ఏకీభవించారని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు.

  Last Updated: 22 Nov 2023, 06:11 PM IST