Water Supply: జనవరి 3న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

  • Written By:
  • Updated On - January 1, 2024 / 02:12 PM IST

Water Supply: నగరంలోని పలు ప్రాంతాల్లోని నివాసితులకు జనవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) తెలిపింది. కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా సంతోష్ నగర్ వద్ద పైప్‌లైన్‌పై జంక్షన్ పనుల కారణంగా నీటి సరఫరాలో ఈ అంతరాయం ఏర్పడింది. ఈ తాత్కాలిక నీటి సరఫరా నిలిపివేత కారణంగా పాతబస్తీలోని మీర్ ఆలం, కిషన్ బాగ్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, యాకుత్‌పురా,

మాదన్నపేట్, రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గుల కుంట, అఫ్జల్‌గంజ్, , నారాయణగూడ, అడిక్‌మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలుకలగూడ మరియు దిల్ సుఖ్ నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. అంతేకాదు.. కొన్ని సమీప ప్రాంతాలు నీటి సరఫరాలో అంతరాయాలను కూడా ఎదుర్కొంటాయి. నివాసితులు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని  HMWS&SB అధికారులు తెలిపారు. ఇక పైపులైన్ల మరమ్మతుల కారణంగా నీరు కలుషితం అవుతున్నట్టు కొంతమంది ఆరోపిస్తున్నారు.