Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో అడుగంటుతున్న జలాలు.. జీహెచ్ ఎంసీ అలర్ట్

Rs 5000 Fine

Rs 5000 Fine

Hyderabad: కోటిన్నర జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, కృష్ణా 1,2, 3, గోదావరి ఫేజ్ -1 నుంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని కోర్ సిటీ GHMC 1098 MLD, ORR ఏరియాల్లో 270MLD, మిషన్ భగీరథ 150 MLD సరఫరా చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 4.12శాతం నీటి సరఫరాకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్యపై 1700 ప్రాంతాలు, 37వేల ఇండ్లలో సర్వే చేయించిన వాటర్ బోర్డు, డిమాండ్‌కు కారణం గ్రౌండ్ వాటర్ తగ్గడమే అని తేల్చినట్లు తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వస్తాయనే ఇంకుడుగుంతలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 37 మందికి నోటీసులు కూడా జీహెచ్ఎంసీ నుంచి ఇచ్చినట్లు వివరించారు.నగరంలో వాటర్ సమస్య ఉన్నప్పటికీ గత ఏడాది మార్చి నెలలో 21వేల మంది కస్టమర్స్ వాటర్ ట్యాంకర్లు అడిగితే, ఇప్పుడు 31వేల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. మహానగర వ్యాప్తంగా 78 పిల్లింగ్ స్టేషన్లు ఉంటే 700 ట్యాంకర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇక, రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక నెల రోజుల్లో 1,50,000 ట్రిప్పులు నీళ్లను అందిస్తుంటే, మేలో రెండు లక్షల 50 వేలు, జూన్ జూలైలో మూడు లక్షల వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని వాటర్ బోర్డు అంచనా వేస్తోంది. వీటన్నిటిని తట్టుకోవాలంటే ఇప్పుడున్న ట్యాంకర్లతో పాటు మరొక 300 ట్యాంకర్లను సైతం పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.