Site icon HashtagU Telugu

Bhadrachalam : ఉప్పోంగుతున్న గోదావ‌రి.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద ప్ర‌మాద‌స్థాయికి చేరిన వ‌ర‌ద నీరు

bhadrachalam

bhadrachalam

భారీ వర్షాలతో గోదావరి నది పొంగిపొర్లుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 20 అడుగులు ఉన్న నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 1 గంటకు 28.9 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి కూడా వరద నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రానున్న 24 గంటల్లో నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటిమట్టం పెరుగుతుండడంతో భద్రాచలంలోని చాలా స్నానఘట్టాలు నీట మునిగాయి. శ్రీరాముని దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేసే సమయంలో లోతుకు వెళ్లకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.