ఐపీఎల్ లో అభిమానులకు హాస్యాన్ని, వినోదాన్ని కూడా పంచే టీమ్ ఏదైనా ఉందంటే.. అది రాజస్థాన్ రాయల్స్. ఆ టీమ్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ తో ప్లేయర్స్ యుజ్వేందర్ చాహల్, దేవ్ దత్ పడిక్కల్, కె.సి.కరియప్ప చేసిన ప్రాంక్ నవ్వుల పువ్వులు పూయించింది. ప్రసిద్ కృష్ణ ను ఆట పట్టించేందుకు ఆ ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఒక కెమెరా టీమ్ ను ప్రసిద్ కృష్ణ దగ్గరికి పంపారు. వారు ఫోటో షూట్ పేరుతో ప్రసిద్ కృష్ణ తో రకరకాల స్టిల్స్ లో ఫోటోలు, వీడియోలు తీశారు. ఈక్రమంలో ఇయర్ ఫోన్స్ ద్వారా యుజ్వేందర్ చాహల్, దేవ్ దత్ పడిక్కల్, కె.సి.కరియప్ప బ్యాచ్ ఇచ్చే సూచనలను ఫోటో షూట్ టీమ్ పాటించింది. వారు చెప్పే సాంగ్స్ కు అనుగుణంగా ప్రసిద్ కృష్ణ తో డ్యాన్స్ వేయించారు. సినిమాల డైలాగ్ లు చెప్పించారు.
ఈక్రమంలో హిందీ సినిమా “భూల్ భులయ్య” లోని ఒక పాటకు ప్రసిద్ కృష్ణ వేసిన డ్యాన్స్ ను చూసి.. యుజ్వేందర్ చాహల్, దేవ్ దత్ పడిక్కల్, కె.సి.కరియప్ప గదిలో కూర్చొని గంతులేస్తూ ఆనందాన్ని ఆస్వాదించారు. చివర్లో ప్రసిద్ కృష్ణ ముందుకొచ్చి నిలబడ్డ ముగ్గురు తుంటరి దుస్తులు.. ఆటపట్టించినందుకు క్షమాపణ కోరారు. దీన్ని ప్రసిద్ కృష్ణ చాలా ఫ్రెండ్లీ గా తీసుకున్నాడు. ఆ ఫోటో షూట్ ను తెర వెనుక నుంచి నడిపించింది తామేనని యుజ్వేందర్ చాహల్ చెప్పాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియోకు పెద్దఎత్తున వ్యూస్ వచ్చాయి. ఎంతోమంది షేర్ చేశారు. మే 20న జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను రాజస్థాన్ రాయల్స్ ఢీకొననుంది.
Violence, violence, violence – Skiddy’s mood after this shoot, thanks to @devdpd07, @cariappa14 & @yuzi_chahal. 😂 #RoyalsFamily | #Whysoformal | @prasidh43 pic.twitter.com/7pjCFnNKCb
— Rajasthan Royals (@rajasthanroyals) May 18, 2022