Kohli Golden Duck: విరాట్ మూడో గోల్డెన్ డక్.. వీడియో వైరల్!

ఈ ఐపీఎల్ సీజన్ లో మూడోసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ పెట్టాడు.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 03:41 PM IST

ఈ ఐపీఎల్ సీజన్ లో మూడోసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ పెట్టాడు. అదేనండీ.. మొదటి బంతికే ఔట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో మూడో గోల్డెన్ డక్ నమోదైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ జగదీష్ సుచిత్ వేసిన మొదటి బంతికే విరాట్ ఔట్ అయి పెవిలియన్ కు చేరాడు. ఈ తరుణంలో ఎంతో అసంతృప్తిగా ఉన్న విరాట్ ను RCB హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఓదార్చారు. ఆందోళనకు గురికావొద్దని, రాబోయే మ్యాచ్ లలో బాగా ఆడొచ్చని ధైర్య వచనాలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. కోచ్ స్థానంలో సంజయ్ చాలా చక్కగా ప్రవర్తించారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు మొత్తం 6 సార్లు విరాట్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇంతకుముందు.. 2008 లో ముంబై ఇండియన్స్ జట్టుపై, 2014లో పంజాబ్ కింగ్స్ పై, 2017లో కోల్ కతా నైట్ రైడర్ పై, 2022 లో లక్నో సూపర్ జయింట్స్ పై, సన్ రైజర్స్ హైదరాబాద్ పై విరాట్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో RCB మ్యాచ్ లో..

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB కేవలం 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధికంగా 73 రన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ 8 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇందులో 1 ఫోర్, 4 సిక్స్ లు ఉన్నాయి. 193 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బ్యాటింగ్ బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠి ఒక్కడే బాగా ఆడాడు. అతడు 5 రన్స్ చేశాడు. మిగితా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో RCB 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. RCB బౌలర్ వనిండు హసరంగ విజృభించి 5 వికెట్లు తీశాడు. దీంతో అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో RCB నాలుగో స్థానంలో ఉంది. గత 12 మ్యాచ్ లలో 14 పాయింట్లు సాధించింది.