Site icon HashtagU Telugu

Watch: ఆకాశమంత ప్రేమ.. ఆడబిడ్డకు అరుదైన స్వాగతం!

Baby Girl

Baby Girl

మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ ఆడబిడ్డకు హెలికాప్టర్‌ ద్వారా ఘన స్వాగతం పలికారు. దేశంలోని చాలామంది ఆడపిల్ల పుట్టడాన్ని వ్యతిరేకిస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం ఆడబిడ్డ పుట్టడం పట్ల అమితమైన ఆనందం వ్యక్తం చేశారు. షెల్గోన్‌కు చెందిన ఒక జంట తమ ఆడబిడ్డకు జన్మనిచ్చినందుకు, ఇంటికి తీసుకురావడానికి హెలికాప్టర్ రైడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తండ్రి విశాల్ జరేకర్ మాట్లాడుతూ.. మా కుటుంబం మొత్తంలో ఇప్పటివరకు ఆడపిల్ల లేదు. కాబట్టి, మా కూతురి గృహప్రవేశాన్ని జీవితాంతం గుర్తుండేలా రూ. 1 లక్ష విలువైన హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశామన్నారు.

రాజలక్ష్మి అనే పాప జనవరి 22న భోసారిలోని జన్మించింది. అనంతరం పసిబిడ్డకు స్వాగతం పలికేందుకు తల్లిదండ్రులు హెలికాప్టర్‌లో ప్రత్యేక గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. ఆడబిడ్డకు ఇంటికి చేరుకునే సమయంలో పూల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత మా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఆ సంతోషం ఎనలేనిది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండేందుకు మేం ఈ ఏర్పాటు చేశామని చెప్పారు పాప తల్లిదండ్రులు.