Watch: ఈద్ సంబురాల్లో చెన్నై సూపర్ కింగ్స్!

ఇవాళ ఈద్. దేశవ్యాప్తంగా ముస్లీంమైనార్టీ సోదరులు పండుగను జరుపుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dhoni

Dhoni

ఇవాళ ఈద్. దేశవ్యాప్తంగా ముస్లీం మైనార్టీ సోదరులు పండుగను జరుపుకుంటున్నారు. కాగా ఈద్ ను పురస్కరించుకొని చెన్నై సూపర్ కింగ్స్ సంబురాలు జరుపుకుంది. (CSK) ఆటగాళ్లు తమకు ఇష్టమైన వాళ్లతో హోటల్ లో సరదాగా గడిపారు. MS ధోని, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, ఇతర స్టార్‌లు ఇష్టమైన ఫుడ్ తింటూ చిట్ చాట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు. రవీంద్ర జడేజా తన కెప్టెన్సీ వదులుకున్న తర్వాత CSK కెప్టెన్‌గా తిరిగి వచ్చిన ధోనీ తన పిల్లలతో మాట్లాడుతుండటం వీడియోలు చూడొచ్చు.

జడేజా తన ఆటతీరుపై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ధోని CSK కెప్టెన్‌గా తిరిగి నియమించబడ్డాడు. ధోని బాధ్యతలు స్వీకరించిన తర్వాత, CSK ఆదివారం SRH ను ఓడించింది. ఈ విజయంతో CSK ఇప్పుడు తొమ్మిది మ్యాచ్‌లలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించింది. గత మ్యాచ్ లో SRHకి, CSK మొదట బ్యాటింగ్ చేయమని కోరింది. MS ధోని నేతృత్వంలోని జట్టు 20 ఓవర్లలో 202/2 చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 99 పరుగులతో చెలరేగగా, డెవాన్ కాన్వే 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ నటరాజన్ గైక్వాడ్‌ను అవుట్ చేయడంతో 17.5 ఓవర్ల తర్వాత హైదరాబాద్‌కు తొలి వికెట్ లభించింది. ముఖేష్ చౌదరి నాలుగు వికెట్లు పడగొట్టాడు, CSK SRHని 189/6కి పరిమితం చేసింది, 13 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

  Last Updated: 03 May 2022, 05:22 PM IST