Site icon HashtagU Telugu

Virat Kohli Duck: ఏమైంది కోహ్లీ…ఎందుకిలా..?

Virat Imresizer

Virat Imresizer

RCB మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ మరోసారి మొదటి బంతికే ఔటయ్యాడు. ఐపీఎస్ లో ఏప్రిల్ 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ సర్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళ్లి ఒక్క పరుగు చేయకుండానే మొదటి బంతికే ఔటయ్యాడు. కోహ్లీ గోల్డెన్ డక్ కి గురికావడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆ జట్టుకు చెలరేగింది. మార్కో యెన్సన్ మొదట రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే కోహ్లీ ఆ తర్వాత బాల్ కు పెవిలియన్ చేరాడు. మర్కో యెన్సన్ 140KMPHవేగంతో బౌలింగ్ చేయగా…కోహ్లీ దానిని మిడ్ ఆన్ వైపు ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బాల్ ఔటర్ ఎడ్జ్ తగలడంతో బంతి నేరుగా సెకండ్ స్లిప్ దగ్గర నిలబడిన ఐడాన్ మార్క్రామ్ చేతిలోకి వెళ్లింది.

కోహ్లీకి అక్కడేం జరిగిందో చూసి షాకయ్యాడు. కొద్ది నిమిషాల తర్వాత కోహ్లీ చిరునవ్వు చిందిస్తూ..పెవిలియన్ వైపు వెళ్లాడు. IPLలో వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ కావడం ఇదే మొదటిసారి. అంతకుముందు లక్నో తో జరిగిన చివరి మ్యాచ్ లో కోహ్లీ ఒక పరుగు కూడా చేయలేదు. తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ లో విరాట్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయాడు. ఇలా జరగడం ఇది నాలుగోసారి.

https://twitter.com/SlipDiving/status/1517877512872685569

Exit mobile version